బుధవారం, 29 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 నవంబరు 2019 (23:08 IST)

శని గ్రహ వక్రదృష్టి ఫలితం ఎలా వుంటుంది?

శనిదేవుడు వాస్తవానికి చాలా మంచివాడు. కర్మలను అనుభవించేలా చేసి భవిష్యత్ రోజులు మంచి జరిగేలా చేస్తాడు. ఈ శనిగ్రహమహిమ ఎలా వుంటుందంటే... శని ఆయుష్షును ప్రసాదిస్తాడు. స్థిరత్వాన్ని ఇస్తాడు. వైరాగ్యం కల్పిస్తాడు. కష్టాలపాలు చేసి సుఖాలను అందిస్తాడు. శవిగ్రహ వక్రదృష్టి వల్ల నలమహారాజు అడవుల పాలయ్యాడు. రావణుడు సర్వం కోల్పోయి రాముని చేతిలో మరణించాడు. 
 
శనిని నీలాంజన నమా భాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరమ్ అని స్తుతించాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసి నల్లనువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయాలి. నీలం ధరించాలి. దశరథకృత శనిస్తోత్రం పఠించాలి.