శీతాకాలంలో పెదవుల పగుళ్లు- ఈ చిట్కాలు పాటిస్తే...
చలికాలంలో వీచే చల్లని గాలుల వల్ల పెదవులు ఎండిపోవడం, కొందరికి పెదవులు పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. తేనెతో కాస్త వాస్లిన్ కలిపిన మిశ్రమాన్ని రోజువారీగా రాసుకుంటే లిప్స్ గులాబీల్లా ఉంటాయి.
2. చలికాలంలో పెదవులకు అలొవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్‌ను వాడినా మంచి ఫలితం ఉంటుంది.
3. మిల్క్ క్రీమ్స్ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చు.
4. నెయ్యిని రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రాసుకోవాలి.
5. కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది.