సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (18:10 IST)

పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం.. (video)

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.
 
పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.
 
పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.