శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (10:43 IST)

లెన్స్ పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త సుమా!

కళ్లకి అద్దాలకు బదులు లెన్స్ పెట్టుకోవడానికి ఈతరం అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారు. కొందరైతే దుస్తుల రంగుకు మ్యాచ్ అయ్యేట్టు వాటిని ఎంచుకుంటున్నారు. అయితే లెన్స్ అందాన్ని ఎంతపెంపొందిస్తాయో... వాటిని వాడేటప్పుడు అంత అప్రమత్తంగా ఉండాలి.
 
అలంకరణ అంతా పూర్తయ్యాక అంటే మస్కారా, కాటుక వంటివి పెట్టుకున్నాకనే లెన్స్ ధరించాలి. లెన్స్ తీయకముందే మేకప్‌ను తొలగించుకోవాలి. ఇలా చేయడంవల్ల కంటి ఇన్ ఫెక్షన్లూ, ఇతర సమస్యలూ దరిచేరవు. వాటిని పెట్టుకోవడానికి ముందు శుభ్రంగా తుడవాలి. పొడిగా ఉండేలా చూసుకోవాలి.
 
కొందరు చేతులు ఎలా ఉన్నా లెన్స్ పెట్టుకుంటారు. అలా చేస్తే చేతుల మురికి వాటికి అంటుకుని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వాటిని పట్టుకునే ప్రతీసారీ చేతులు శుభ్రపరుచుకోవాలి. పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలానే హెయిర్ స్ప్రేలూ, లోషన్లూ, డియోడరంట్లూ వాడటం మానేయాలి.