మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మనీల
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (13:25 IST)

కళ్ళలో వాపు, నొప్పి, మంటకు ధనియాల పొడితో మటుమాయం...

నోట్లో పొక్కులు ఏర్పడితే లేదా గొంతుకు సంబంధించిన వ్యాధులేవైనా ఉంటే ధనియాల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది. ధనియాలు వంటకు ఉపయోగిస్తుంటారు. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంటుంది.
 
తలనొప్పిగా ఉన్నప్పుడు కొత్తిమిరను రుబ్బుకుని నుదుటిపై లేపనంలాగా పూసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే దెబ్బ తగిలి వాపున్న చోట ఈ లేపనాన్ని పూస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
కళ్ళలో వాపు, నొప్పి, మంట ఉన్నప్పుడు ధనియాలను పొడి చేసుకుని ఆ పొడిని నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని వడకట్టండి. వడకట్టిన నీటిని చుక్కల మందులా కంట్లో పోయండి. దీంతో వాపు, నొప్పి, మంట మటుమాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముక్కు నుంచి రక్తం కారుతుంటే కొత్తిమిర రసాన్ని ముక్కులో పోయండి. దీంతో ముక్కులో నుంచి రక్తం రావడం తగ్గుతుంది. వేడి వలన కడుపు నొప్పి వచ్చినప్పుడు ధనియాల చూర్ణాన్ని కలకండతో కలిపి సేవిస్తే మంచి ఫలితముంటుంది.