సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By మనీల
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (11:06 IST)

గర్భిణులు షేషియల్ వేసుకోవడం మంచిదా..?

చాలామంది తరచు చెప్పే మాట ఏంటంటే.. గర్భిణులు ఫేషియల్ చేసుకోకూడదని.. కానీ, వారి మానసిక ప్రశాంతతకు ఫేషియల్ చాలా అవసరమని చెప్తున్నారు వైద్యులు. గర్భిణులు ఫేషియల్ చేయించుకుంటే.. వారి మైండ్‌కు రాలాక్స్‌గా ఉంటుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. మరి వీరు షేషియల్ వేసుకోవడం మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
గర్భిణులకు రిలాక్సేషన్ చాలా అవసరం. ఆ రిలాక్సేషన్ వారికి ఇంట్లోనే లభిస్తుంది. అందుకు ఫేషియల్ వేసుకోవాలసిన అవసరం కూడా లేదు.. ఎలాగంటే.. అప్పుడప్పుడా వాకింగ్ చేయడం వంటివి చేస్తే మానసికంగా కుదుటపడుతారు. ఒకవేళ ఇంట్లో రిలాక్సేషన్ లభించకపోతే మాత్రం ఫేషియల్ చేసుకోవడంలో తప్పు లేదని కూడా పరిశోధనలో తెలియజేశారు. 
 
ఫేషియల్ చేసుకోవడం వలన రిలాక్సేషన్‌తో పాటు శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మొత్తానికి గర్భిణులకు ఫేషియల్ మంచి ఫలితాలనే ఇస్తుంది. గర్భిణులు ఫేషియల్ చేసుకునేటప్పుడు మాత్రం మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుకోవాలి. ఫేషియల్ చేసేటప్పుడు ముఖంలో నరాలు మెదడును ప్రభావితం చేస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి.