సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By మనీల
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (14:11 IST)

గర్భిణీ మహిళలు కందిపప్పు తీసుకోవచ్చా...? (VIDEO)

కందిపప్పును వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. భారతీయ వంటకాల్లో కందిపప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. కందిపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది. కందిపప్పులో ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. గర్భిణులు కందిపప్పు తీసుకుంటే పుట్టబోయే శిశువుకు చాలా సహాయపడుతుంది. చాలామందికి గర్భంలోనే పిల్లలు చనిపోతుంటారు.. ఇలాంటి విషయాలు మరోసారి జరగకుండా ఉండాలంటే.. కందిపప్పు తీసుకోవాల్సిందే..
 
కందిపప్పులోని ఫోలిక్ యాసిడ్ గర్భంలోని శిశువుకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అంతేకాదు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇటీవలే ఓ పరిశోధలో కందిపప్పు తీసుకునే గర్భిణి మహిళలకు 70 శాతం.. శిశువు ఎలాంటి అనారోగ్యాలతో చనిపోకుండా జన్మిస్తుందని తెలియజేశారు. కందిపప్పులో ప్రోటిన్స్, న్యూట్రియన్, ఫైబర్ ఫాక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. 
 
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. కందిపప్పులోని ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం వంటి రోగాల నుండి కాపాడుతుంది. రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కందిపప్పు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి సమస్యలైన పరిష్కరించవచ్చును.