మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (13:42 IST)

ప్రియురాలిని గర్భవతి చేశాడు, ఇంట్లో తెలిసిపోతుందని అబార్షన్ చేయిస్తే...

చిత్తూరు జిల్లా నగరిలో దారుణం చోటుచేసుకుంది. విజయపురం మండలం శ్రీరామపునారికి చెందిన శీను(పేరు మార్చాము)... అదే గ్రామానికి చెందిన రమణ( పేరు మార్చాము) గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. రమణ స్థానికంగా ఉన్న వెంకట పెరుమాళ్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. వీరి ప్రేమ కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. దీంతో రమణ గర్భం దాల్చింది.
 
విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోతుందన్న భయంతో ప్రియుడు శీను నగరిలోని దేవి ఆర్.ఎం.పి. వైద్యశాలలలో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. అబార్షన్ చేస్తుండగా రమణకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రమణ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. 
 
వెంటనే రమణను నగరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆర్.ఎం.పి. డాక్టర్ పరారవ్వగా.. ప్రియుడు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.