బేబీ పౌడర్‌తో సౌందర్యం మీ సొంత..

మనీల| Last Modified శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:12 IST)
ఇంట్లో బేబీ పౌడర్ ఉందా..? అయితే దాన్ని సౌందర్య సంరక్షణకూ ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటారా.. ఇవిగోండి.. ఆ చిట్కాలు.

* కనురెప్పలు అందంగా కనిపించేందుకు మస్కారా వేసుకుంటం. దాన్ని వాడే ముందు కనురెప్పలపై కొద్దిగా పౌడర్‌ను అద్దుకుని తర్వాత మస్కారా వేసుకోండి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు నిండుగా కనిపిస్తాయి.

* డియోడరంట్ పడటం లేదా.. బాహుమూలల్లో కొద్దిగా బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది చెమటను సులువుగా పీల్చడమే కాదు. దానివల్ల వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.

* కాళ్లూ, చేతులపై చర్మం పొడిబారి విపరీతంగా దురదపెడుతుంది. ఇలాంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కమిలిన భాగాల్లో బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.దీనిపై మరింత చదవండి :