శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (17:22 IST)

చర్మ సౌందర్యం కోసం మజ్జిగతో స్నానం...

సాధారణంగా మజ్జిగను వేసవి కాలంలో అమితంగా తాగుతుంటారు. వడదెబ్బ నుంచి త్వరగా కోలుకునేందుకు మజ్జిగ తాగమని సలహా ఇస్తుంటారు. అంతేకాదండోయ్... ఈ మజ్జిక కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది.
 
దీనికి కారణం.. ఇందులో ఉండే కెలోరీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, వ్యాధినిరోధక శక్తి మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గును దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి మజ్జిగతో చర్మసౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం. 
 
మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. అలాగే, మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరం కావడంతో పాటు మృదువైన, నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు.