సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (15:06 IST)

వక్షస్థలం, బొడ్డుపై బల్లిపడితే ఫలితం ఏమిటంటే?

మహిళలు లేదా పురుషుల వక్షస్థలంపై బల్లిపడితే ధనాదాయం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వక్షస్థలం ఎడమ వైపు బల్లిపడితే.. సుఖం. అదే కుడివైపు బలిపడికే.. లాభం చేకూరుతుందని.. ఆదాయం వుంటుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే బల్లి గనుక మెడ ప్రాంతంలో పడితే.. అది కుడివైపు గొంతు ప్రాంతంలో పడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ ఎడమవైపు గొంతు ప్రాంతంలో పడితే ఇతరులతో శత్రుత్వం ఏర్పడుతుంది. 
 
ఇకపోతే.. బొడ్డుపై బల్లి పడితే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. భారీ విలువ చేసే వజ్రవైఢూర్యాలు, రత్నాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కనురెప్పలపై బల్లిపడితే ఉన్నతాధికారుల నుంచి సహాయం లభిస్తుంది. నుదుటికి కుడివైపు, ఎడమవైపు బల్లి పడితే.. కీర్తి ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మ కటాక్షం చేకూరుతుంది.