శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (09:39 IST)

సంతానం కలగలేదని గుడికి వెళ్తే.. అమరావతి గుడిలో అర్చకుడు ఎంతపని చేశాడు..

సంతానం కలగలేదని గుడికి వెళ్తే పూజారి ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా అమరావతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసం చేసేందుకు వచ్చిన వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే..విజయవాడకు చెందిన దంపతులు మంగళవారం ఉదయం గ్రామంలోని ఆలయాన్ని సందర్శించుకున్నారు. 
 
సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు. పిల్లలు పుట్టాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో జడుసుకున్న ఆ మహిళ కేకలు పెట్టడంతో అర్చకుడు పారిపోయాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వారు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.