శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (11:19 IST)

జుట్టు రాలిపోవడాన్ని ఆపలేమా? ఇదేమైన వారసత్వపు సమస్యా?

చాలా మందికి చిన్నవయసులోనే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తలస్నానం చేసేందుకు వాడే షాంపుల వల్ల, తలకు వాడుతున్న తలైలా వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. అసలు జుట్టు రాలడాన్ని ఆపలేమ

చాలా మందికి చిన్నవయసులోనే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తలస్నానం చేసేందుకు వాడే షాంపుల వల్ల, తలకు వాడుతున్న తలైలా వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. అసలు జుట్టు రాలడాన్ని ఆపలేమా? ఇదేమైనా వారసత్వపు సమస్యా? అని పరిశీలిస్తే... 
 
వెంట్రుకల పోషణకు అవసరమైన ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, జింక్‌, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు జీవనశైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. 
 
ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. అంతేకానీ, ప్రతి సమస్యనూ వారసత్వ మూలాలకే ఆపాదించడం మంచిదికాదు. ఎందుకంటే, పోషకాలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అతని జుత్తు రాలిపోయి ఉండవచ్చు.