గురువారం, 23 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 21 సెప్టెంబరు 2022 (16:47 IST)

రాత్రివేళ పనిచేస్తే అంతే సంగతులు..

Diabetes
రాత్రివేళ పనిచేయడం ద్వారా  అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తుల్లో టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని యుఎస్‌లోని రట్జర్స్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. 
 
ఉదయం పూట చురుకుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు.. శక్తి వనరుగా కొవ్వుపై ఎక్కువగా ఆధారపడతారని.. రాత్రి వేళ పనిచేసే వారికంటే, లేటుగా నిద్రపోయే వారి కంటే ఎక్కువ స్థాయి ఏరోబిక్ ఫిట్‌నెస్‌తో పగటిపూట మరింత చురుకుగా ఉంటారని గుర్తించారు.
 
మరోవైపు, పగలు, రాత్రి సమయంలో చురుకుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు విశ్రాంతి సమయంలో, వ్యాయామ సమయంలో శక్తి కోసం తక్కువ కొవ్వును ఉపయోగిస్తారని అధ్యయనం తెలిపింది.
 
తాజా పరిశోధనలో పాల్గొన్న 51 మందిని రెండు గ్రూపులుగా వర్గీకరించారు. ఉదయం పనిచేసేవారిని, రాత్రి పనిచేసేవారిని విభజించి.. వారి కాలక్రమం లేదా వివిధ సమయాల్లో కార్యాచరణ, నిద్రను కోరుకునే విధానం, పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 
 
రోజంతా వారి కార్యాచరణ, పలు అంశాలను అంచనా వేయడానికి ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని ఒక వారం పాటు పర్యవేక్షించారు. వారి క్యాలరీలు, పోషకాహారం-నియంత్రణ ఆహారాన్ని ఎంత తీసుకున్నారు. ఫలితాలపై ఆహార ప్రభావాన్ని తగ్గించడానికి రాత్రిపూట ఉపవాసం చేయవలసి వచ్చింది. 
 
రెండు నుంచి 15 నిమిషాల వ్యాయామాలను పూర్తి చేయడానికి ముందు వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు పరీక్షించారు. ఇంకా ట్రెడ్‌మిల్‌పై ఒక మోస్తరు, ఒక అధిక-తీవ్రత సెషన్ కూడా పరిశీలించారు.
 
ఇంక్లైన్ ఛాలెంజ్ ద్వారా ఏరోబిక్ ఫిట్‌నెస్ స్థాయిలను పరీక్షించారు. రాత్రి వేళ పనిచేసే వారి కంటే విశ్రాంతి, వ్యాయామ సమయంలో శక్తి కోసం ఎక్కువ కొవ్వును ఉపయోగించారని పరిశోధకులు కనుగొన్నారు. అలాంటివారిలో ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు.
 
మరోవైపు, రాత్రి వేళ పనిచేసే వారు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. అంటే వారి శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. అలాంటి వారి శరీరం కొవ్వుల కంటే శక్తి వనరుగా కార్బోహైడ్రేట్లను ఇష్టపడతాయని పరిశోధకులు తెలిపారు.