శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (02:57 IST)

బ్రేక్ ఫాస్ట్ చేయడం దాటేస్తున్నారా.. మీ బాడీలో ఈ మార్పులు తప్పవ్!

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ తినకుండా తరచుగా దాటవేస్తున్నారా? అయితే అది మంచి అలవాటు కాదు పైగా అనేక ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. రోజు మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైన ఆహారం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం టిఫన్ చేయడం నిలిపివేయవద్దు.

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ తినకుండా తరచుగా దాటవేస్తున్నారా? అయితే అది మంచి అలవాటు కాదు పైగా అనేక ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. రోజు మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైన ఆహారం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం టిఫన్ చేయడం నిలిపివేయవద్దు. బ్రే్క్‌ఫాస్ట్ చేయడం ఆపివేసినా, దాటేసినా ప్రత్యేకించి మహిళలకు మధుమేహం రావడం ఖాయం. రోజు టిఫిన్ తినేవారిలో కంటే, టిఫిన్ తీసుకోని మహిళల్లోనే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువట. బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే మహిళలలు ఎదురయ్యే ప్రమాదాలు చూద్దామా?
 
గుండె వ్యాధి
రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వారికంటే తీసుకోని వారికే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. బ్రేక్ ఫాస్ట్ ఆపివేస్తే అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధం, రక్తపోటు స్థాయిలను పెంచడం  వంటివి పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. 
 
మైగ్రేయిన్
టిఫిన్ తీసుకోకపోతే సుగర్ లెవల్స్ పెరిగిపోయి మైగ్రెయిన్ తలనొప్పి వచ్చే ప్రమాదం ఉందట. రక్తపోటు పెరిగి, తలనొప్పి, తీవ్ర శిరోభారం కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.
 
హెయిర్ లాస్
శిరోజ కణాలు పెరగటంలో, పెంచడంలో బ్రేక్ ఫాస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రొటీన్ చాలా తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కెర్టెయిన్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల శిరోజాలు పెరగడం నిలిచిపోతుంది. జట్టు రాలటం కూడా జరుగుతుంది.