సున్నిపిండితో నిమ్మరసం కలిపి స్నానం చేస్తే మృతకణాలు మాయం!

శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:26 IST)
నిమ్మకాయ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు తిరుగుతాయి కదూ! రుచికి మాత్రం పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. మన శరీరానికి ఒక రోజు మొత్తానికి కావాల్సిన సి-విటమిన్‌ను నిమ్మ అందిస్తుంది. నిమ్మ గురించి కొన్ని ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన చిట్కాలు తెలుసుకుందామా...!!
 
నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది. అధిక బరువుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది. 
 
నిమ్మరసం తాగినా... నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా... చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు. తలస్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేస్తే కురులు నల్లగా మెరుస్తాయి. ముల్తానామట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
 
నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
 
నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది. కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి. 

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments