1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Lose weight easily with lemon juice

నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకుని తాగితే..?

Lose weight
రోజు వారి ఆహారంలో నిమ్మను తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే అజీర్తి, పైత్యం తగ్గిపోతాయి. అదే విధంగా లివర్ క్లీన్ అవుతుంది. 
 
నిమ్మరసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూసుకుంటుంది. జీర్ణ క్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు ఉండవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిమ్మతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.
 
అలానే నిమ్మని ఉపయోగించడం వల్ల బరువు కూడా తగ్గచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా నిమ్మరసం తీసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కనుక మీరు మీకు నచ్చిన కూరగాయలను అన్నిటినీ కట్ చేసుకొని దానిలో నిమ్మరసం వేసుకుని కూడా తీసుకోవచ్చు. 
 
నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకు తీసుకోవచ్చు. లేకపోతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి మొదలైన సమస్యలు ఉండవు. ఇలా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఖర్జూరం వల్ల అనారోగ్యాలు పరార్.. వర్షాకాలంలో ఇవి తింటే..?