శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (17:40 IST)

జొమాటో నుంచి ఐపీఓ ప్రారంభం..

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐపిఓ కింద ధరల శ్రేణి ఒక్కో షేరుకు 72 నుంచి 76 రూపాయలుగా నిర్ణయించబడింది. ఐపీఓ ఇష్యూ ద్వారా రూ .9,375 కోట్లు సేకరించాలని కంపెనీ జొమాటో యోచిస్తోంది. ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది.
 
ఈ సంస్థకు యాంట్ గ్రూప్ కంపెనీ జాక్ మా మద్దతు ఇస్తుంది. అంతే కాదు ఇందులో చైనీస్‌ దిగ్గజం యాంట్‌ గ్రూప్‌ జాక్ మా పెట్టుబడులు ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఐపీవో ద్వారా స్టాక్‌ ఎక్చేంజీలలో లిస్ట్‌ కానున్న తొలి దేశీ యూనికార్న్‌ స్టార్టప్‌గా నిలవనుంది జొమాటో. అంతేకాకుండా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన తొలి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థగా కూడా నిలుస్తోంది.
 
మరోవైపు 2020 మార్చిలో ఐపీవో ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించిన ఎస్బీఐ కార్డ్స్‌ తదుపరి అతిపెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత వచ్చిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఇష్యూని బ్రేక్ చేసింది. ఐపీవోలో భాగంగా జొమాటో రూ. 9,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.