సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 4 మే 2021 (22:58 IST)

ర‌వితేజ మ‌ళ్ళీ స్పీడ్ పెంచాడు!

Raviteaj
ర‌వితేజ సినిమాలంటే మాస్ చిత్రాలు. వ‌య‌స్సురీత్యా కొన్ని సినిమాలు చేసినా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అలాంటి టైంలో క్రాక్ సినిమాతోనే ఊహించ‌ని స‌క్సెస్ సాధించాడు. ఆ త‌ర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నా, ఆయ‌న‌లో వున్న స్పీడ్ త‌గ్గ‌లేదు. ఎన‌ర్జిట్ హీరోగానే ముందుకు సాగ‌తున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ప్ర‌భాస్‌కంటే ఎక్కువ సినిమాలు చేసేస్తున్నాడు. 
 
ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చేస్తున్నారు. ఇంకొద్దిగా షూట్ మాత్రమే మిగిలి ఉంది. క‌రోనా వ‌ల్ల ఆల‌స్య‌మైంది. అయితే విడుద‌ల‌కు కూడా మ‌రింత ఆల‌స్యమ‌య్యేట్లుంది. ఇది పూర్తయ్యాక వరుసగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రం, శరత్ మండవ డైరెక్షన్లో ఒక చిత్రం చేయనున్నారు.
 
ఇక ఎప్ప‌టినుంచో బోయ‌పాటితో సినిమా చేయాల‌నేది ఆయ‌న కోరిక‌. అది కూడా క‌థ సిద్ధంగా వున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా అనిల్ రావిపూడితో సినిమా చేయాల్సివుంది. టోట‌ల్‌గా చూస్తే ఐదు సినిమాలు ర‌న్నింగ్‌లో వున్నాయ‌న్నమాట‌. ఈ సినిమాల‌తో ఆయ‌న చాలా బిజీ అయిపోయాడు. ఇప్ప‌టి యూత్ హీరోల‌కంటే ఆయ‌న స్పీడ్‌లో వున్నాడ‌న్న‌మాట‌.