నెలాఖరువరకు ఇటలీలోనే `ఖిలాడి`
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `ఖిలాడి`. ఇటీవలే చిత్ర యూనిట్ ఇటలీ వెళ్ళింది. పాట, కీలక సన్నివేశాల చిత్రీకరణకూడా అక్కడ జరగనుంది. ఇందుకు సంబంధించిన స్టిల్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ ను ఈ మార్చ్ చివరి నాటికి కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఎలా అయినా సరే ఈ చిత్రం మే 28న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్రాక్ ఇచ్చిన స్పూర్తితో మరింత ఎనర్జిటిక్‌గా రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్నఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్ ఖరారుచేశారు.