మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:28 IST)

''ఖిలాడీ''లో అనసూయ రోలేంటి?

టాలీవుడ్ యాక్టర్ రవితేజ క్రాక్ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న 'ఖిలాడీ' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి 40 శాతానికిపై షూటింగ్ పూర్తయినట్టు టాక్‌. 
 
ఈ చిత్రంలో యాంకర్ కమ్ నటి అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే అనసూయ షూటింగ్‌లో కూడా జాయిన్ అయింది. చిత్ర యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం అనసూయ పాత్ర ప్రభావం సినిమాపై చాలా ఉంటుందట.
 
ఖిలాడీలో అనసూయ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తుందని టాక్ వస్తోంది. మొత్తానికి రమేశ్‌వర్మ ఖిలాడీ కోసం చాలా మంది ప్రముఖ నటులను కీలక పాత్రల్లో చూపించబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల టాక్‌. మరి అందాల భామ అనసూయ 'ఖిలాడీ'తో పోటీ పడుతుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చేయాల్సిందే.