`క్రాక్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, `రాక్షసుడు` వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఖిలాడి`.
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్ఫణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్.
రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు `ఖిలాడి` గ్లిమ్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ వీడియోలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్ బాక్సుల మధ్యలో నుండి నడిచివస్తున్న రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. ఈ వీడియో చూస్తుంటే రవితేజ విలన్ బ్యాచ్ పని పట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ అల్ట్రా-స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కు మంచి ట్రీట్ కానున్నదని ఈ గ్లిమ్స్ ద్వారా తెలిపారు మేకర్స్.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లిమ్స్‌ని ఎలివేట్ చేసిందనడంతో సందేహం లేదు.
సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.
ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ 'ఖిలాడి'ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, 'లూసిఫర్' ఫేమ్ సుజిత్ వాసుదేవ్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
'రాక్షసుడు' వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. ఇప్పుడు 'ఖిలాడి' చిత్రాన్ని బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతీలాల్ గడ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
స్క్రిప్ట్ కో ఆర్డినేషన్: పత్రికేయ
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సాగర్
ఎడిటింగ్: అమర్ రెడ్డి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
పాటలు: శ్రీమణి
స్టిల్స్‌ఫ సాయి మాగంటి
మేకప్: ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కంద్రు
కో- డైరెక్టర్: పవన్ కేఆర్‌కె