శనివారం, 17 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 జులై 2021 (22:47 IST)

లివర్ ఎందుకు చెడిపోతుంది?

చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి.
 
మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
 
రాత్రి పూట త్వరగా పడుకొని... ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవ‌చ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు. లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.
 
అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాదు... అదనపు భారం కూడా పడుతుంది.