శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (21:38 IST)

కామెర్ల వ్యాధికి బీరకాయను తీసుకుంటే?

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలిపెట్టం. వీటిలో సాధారణ నేతిబీర అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. బ

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలిపెట్టం. వీటిలో సాధారణ నేతిబీర అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. బీరకాయ రక్తశుద్ధికి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షిస్తుంది.
 
కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం త్రాగడం వలన మంచి ఫలితం ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏర్పడవు. రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు బీరకాయ సహాయపడుతుంది. బీరకాయకు చలువు చేసే గుణం అధికంగా ఉంటుంది. మన ఒంట్లోని అధిక వేడిని తీసివేస్తుంది. అందుకే బీరకాయను వాడుతుంటారు. ఇది తింటే సులువుగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి సాఫీగా వెళ్ళేట్లుగా దోహదపడుతుంది.
 
అల్సర్ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్‌ ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. అంతేగాకుండా బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదు.