సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (20:53 IST)

జామకాయ జ్యూస్ తీసుకుంటే... ఫుడ్ పాయిజన్ నుండి...

జామపండులో విటమిన్ ఎ, సి లు ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చును. ఈ పండులోని యాంటీ ఆక్సిడెట్స్, ఒమేగా -3, 6, ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. జామపండును తినడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించ

జామపండులో విటమిన్ ఎ, సి లు ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చును. ఈ పండులోని యాంటీ ఆక్సిడెట్స్, ఒమేగా -3, 6, ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. జామపండును తినడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చును. జామకాయలను నమలడం వలన పంటి నొప్పులు తగ్గడమే కాకుండా ఆకలిని కూడా పెంచుతాయి.
దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామఆకులు మంచిగా సహాపడుతాయి. జామఆకులను పేస్ట్‌గా తయారుచేసి, పైన తెలిపిన వాటికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. జామకాయతో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను చాలా తగ్గించుకోవచ్చును. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా రక్తం, షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
 
జామకాయ జ్యూస్ కాలేయానికి మంచి ఔషదం లాంటిది. ఈ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. జామఆకులతో తయారుచేసిన టీని రోజుగ తీసుకుంటే ఇది జీర్ణక్రియకు అవసరం అయ్యే జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌ను తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్‌ను వంటి కారకార నుండి తప్పించుకోవచ్చును.