శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By tj
Last Updated : మంగళవారం, 23 మే 2017 (12:55 IST)

మటన్ తింటే వృద్ధాప్యం ఖాయమట..?

ప్రపంచంలో శాఖాహారులకన్నా మాంసాహారులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది అయితే మాంసం లేనిదే ముద్ద కూడా ముట్టరు. మాంసంలో కూడా కొన్నింటిని మాత్రమే ఇష్టపడేవారు ఉంటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా ఒక్కొక్కరి

ప్రపంచంలో శాఖాహారులకన్నా మాంసాహారులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది అయితే మాంసం లేనిదే ముద్ద కూడా ముట్టరు. మాంసంలో కూడా కొన్నింటిని మాత్రమే ఇష్టపడేవారు ఉంటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. అయితే ఇందులో మటన్ మాత్రం ఎప్పుడూ ఎక్కువగా తీసుకోకూడదంటున్నారు వైద్యులు. మటన్ తినే వారిలో వృద్ధాప్య ఛాయలు ఖాయమంటున్నారు. రష్యాలో వైద్యులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందట.
 
చికెన్ ఎక్కువగా తింటే వేడి అంటారు.. కానీ లిమిట్‌గా తింటే మంచిందంటారు. కానీ మటన్ తింటే మాత్రం శరీరం ముడతలుగా మారిపోయి వృద్ధాప్యం రావడం మాత్రం ఖాయమంటున్నారు రష్యా వైద్యులు. 10 మందిపై పరిశోధనలు చేసిన తర్వాత నిర్ధారించారట. అయితే దీన్ని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. మటన్ తింటే అధిక ఫ్యాట్ వస్తుంది తప్ప... దాన్ని తినడం వల్ల వృద్ధాప్యం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు. మొత్తం మీద మటన్ ప్రియులకు మాత్రం దీన్ని జీర్ణించుకోవడం కష్టమే.