గొంతులో గరగర తగ్గిపోవాలంటే.. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే?
శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక
శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి మొదలవుతుంది. కాని ఈ సమస్య వర్షాకాలంలో విపరీతంగా వేధిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొన్నిచిట్కాలు. అవేంటో చూద్దాం...
గోరు వెచ్చని నీటిలో కాస్త తేనే కలిపి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటే కూడా గొంతు సమస్యలు తగ్గిపోతుంది.
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి తగ్గిపోతుంది.
మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు నశించిపోతుంది.
గొంతులో గరగర వంటి సమస్యలు తొలిగిపోవాలంటే ఉల్లిపాయ రసం తీసుకోవడం సేవిస్తే గొంతు సమస్యలు తగ్గుముఖం పడుతుంది.