శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (12:07 IST)

భార్యాభర్తల గొడవలు.. రాత్రి పూట కోపంతో నిద్ర వద్దే వద్దు.. ఏం చేయాలంటే?

రోజంతా హడావుడి. ఇంటికి చేరుకున్నాక కూడా రుసరుసలాడుతూ.. పనులన్నీ ముగించుకుని అదే కోపంతో నిద్రపోతున్నారా? అయితే పద్దతి మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి అలవాటు చేసు

రోజంతా హడావుడి. ఇంటికి చేరుకున్నాక కూడా రుసరుసలాడుతూ.. పనులన్నీ ముగించుకుని అదే కోపంతో నిద్రపోతున్నారా? అయితే పద్దతి మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రోజంతా ఒత్తిడి, పనులు ఎన్నెన్ని ఉన్నా.. వాటిని బుర్ర నుంచి తీసి పక్కనబెట్టి.. ఒత్తిడిని మరిచిపోయి.. హాయిగా.. ఒత్తిడికి సమస్యలకు ఎలాంటి సంబంధం లేదనుకుని నిద్రిస్తేనే.. అనారోగ్య సమస్యలు వేధించవు. ఒబిసిటీ దరిచేరదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏవేవో ఆలోచనలు, ఒత్తిడి వేధిస్తుంటే.. మంచి పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటి పనులు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఇంకా కోపంతో నిద్రించడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు విడదీసుకుంటుంది. అవసరమైన విషయాలను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటుంది. అనవసరమైన వాటిని వదిలించుకుంటుంది. అయితే కోపంతో నిద్రకు ఉపక్రమిస్తే.. మెదడుకు ఆరోగ్యం కాదని.. అనవసరపు ఆలోచనలతో మెదడు నరాలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.. వైద్య నిపుణులు. 
 
అందుకే నిద్రించే ముందు భార్యాభర్తల మధ్య గొడవలు వద్దని.. అలాచేస్తే.. రాత్రంతా అదే ఆలోచన.. కోపం మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని.. అందుకే విబేధాలుంటే పరిష్కరించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే నిద్రించేటప్పుడు భాగస్వాములు సమస్యలను పడకగది వరకు తేవకపోవడం మంచిదని.. ఒకవేళ తెచ్చుకున్నా.. వాటికి పరిష్కారం కనుకున్నాకే.. నిద్రించాలని.. కోపతాపాలకు తావివ్వకూడదని.. అలా చేస్తే ప్రతికూల భావోద్వేగ జ్ఞాపకాలకు మెదడు తావిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.