Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పచ్చి ఉల్లిపాయలను తింటే..? 4 గంటల్లోనే శరీరంలోని షుగర్ తగ్గుతుందట!

Written By మోహన్
Updated: గురువారం, 16 మే 2019 (18:09 IST)
భారతీయుల్లో చాలామంది ప్రస్తుతం బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం కూడా వీటికి కారణం అవుతున్నాయి. వంటల్లో ఉపయోగించే ఆహారపదార్థాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వాటిల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఉల్లిపాయ. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయదే కీలకపాత్ర. 
 
అయితే ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల షుగర్ బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో తేలింది.
 
100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తినడం ద్వారా కేవలం 4 గంటల వ్యవధిలోనే షుగర్ తగ్గుతుందట. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఉల్లిపాయలను తింటే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి తద్వారా షుగర్ కూడా కంట్రోల్ అవుతుందట. 
 
ఈ విషయాన్ని ఎన్విరాన్‌మెంట‌ల్ హెల్త్ ఇన్‌సైట్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే 4 గంటల వ్యవధిలో బ్లడ్ షుగర్ స్థాయి కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు తేల్చారు. కాబట్టి టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు ఎరుపు రంగులో ఉండే పచ్చి ఉల్లిపాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments