శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:40 IST)

ఉల్లికాడల రైస్..?

కావలసిన పదార్థాలు:
ఉల్లికాడలు - 12
పచ్చిబఠాణి - పావుకప్పు
పొడి అన్నం - 1 కప్పు
నిమ్మరసం - 2 స్పూన్స్
పసుపు - అరస్పూన్
సాంబార్ పొడి - ఒకటిన్నర స్పూన్
నూనె - 2 స్పూన్స్
ఆవాలు - స్పూన్
మినపప్పు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
కరివేపాకు - 4 రెబ్బలు
ఉప్పు - సరిపడా
జీడిపప్పు - 10
 
తయారీ విధానం:
ముందుగా ఉల్లికాడలు బాగా శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని పచ్చిబఠాణీ, ఉల్లికాడలు వేసి కొద్దిగా పసుపు, సాంబార్ పొడి చల్లి బాగా వేయించుకోవాలి. తరువాత అన్నం కలుపుకుని చివరగా నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది. అంతే వేడివేడి ఉల్లికాడల రైస్ రెడీ.