ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:14 IST)

పన్నీర్ పకోడీలు తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
పన్నీర్ - పావుకిలో
శెనగపిండి - 1 కప్పు
కారం - స్పూన్
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఓ బౌల్‌లో శెనగపిండి, నీళ్లు పోసి కలుపుకోవాలి. అందులోనే కారం పొడి, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు అలా వదిలేయాలి. ఈ లోపు పన్నీర్ ముక్కల్ని కాస్త చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిపై కారం, ఉప్పు చిలకరించాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడిచేసి శెనగపిండి మిశ్రమంలో పన్నీర్ ముక్కల్ని వేసి పకోడీల్లా వేయించుకోవాలి. అవి గోల్డ్ ‌బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించి తీసుకోవాలి. అంతే పన్నీర్ పకోడీలు రెడీ.