శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (11:37 IST)

చేప బిర్యానీ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
చేపముక్కలు - అరకిలో
షాజీరా - 1 స్పూన
బాస్మతి బియ్యం - 4 కప్పులు
ఉల్లిపాయలు - పావుకిలో 
పచ్చిమిర్చి - 12 
పుదీనా - 1 కట్ట
కొత్తిమీర - 1 కట్ట
కారం - 1 స్పూన్
పసుపు - పావుస్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
మిరియాల పొడి - స్పూన్
నెయ్యి - 50 గ్రా
గరంమసాలా - అరస్పూన్
పెరుగు - కప్పు
నిమ్మరసం - 3 స్పూన్స్
కుంకుమపువ్వు - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా పాన్ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గరంమసాలా వేసి నిమిషం పాటు వేయించుకుని బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లుపోసి సగం ఉడికించుకోవాలి. ఇప్పుడు కడిగిన చేపముక్కలకు కొద్దిగా నిమ్మరసం, కారం, పసుపు, ఉప్పు పట్టించాలి. మరో బాణలిలో స్పూన్ నూనె వేసి మిగిలిన వాటిలో సగం పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తమీర తురుము వేసి 2 నిమిషాలు వేయించుకుని చల్లారనివ్వాలి.
 
తరువాత ముద్దలా చేసి మిరియాలపొడితో సహా చేపముక్కలకు పట్టించాలి. మళ్లీ బాణలిలో కొద్దిగా నూనే వేసి గుండ్రంగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే పొడవుగా చీల్చిన మిగిలిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో స్పూన్ నూనె వేసి అన్నీ పట్టించి ఉంచిన చేపముక్కల మిశ్రమాన్ని వేసి దానిమీద ఉల్లిముక్కల మిశ్రమాన్ని చల్లి నిమ్మరసం పిండాలి. వీటిమీద సగం ఉడికించిన అన్నం వేసి, ఆపైన ఓ స్పూన్ వేడి నూనె, స్పూన్ నెయ్యి చల్లాలి. వాటిమీద కుంకుమపువ్వు కలిపిన పాలు పోసి మూతపెట్టి సిమ్‌లో 25 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి చేపల బిర్యానీ రెడీ.