Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలంటే.. చేపలు తినాలట...

Written By సందీప్
Updated: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:40 IST)
మానవ శరీరానికి విటమిన్ డి చేసే మేలు ఎంతో ఉందని చెప్పాలి. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డి విటమిన్ లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని లోపం దీర్ఘకాలం ఉంటే ఎముకలు వంకర తిరుగుతాయి. 
 
ఇది తగ్గితే ఆకలి అంతగా లేకపోవటం, బరువు తగ్గుదల, నిద్ర సరిగా పట్టక పోవటం, వంట్లో నీరసం వంటి సమస్యలు తరచూ కనిపిస్తాయి. తాజా అధ్యయనాలలో దీని లోపం వలన తీవ్ర తలనొప్పి కూడా వస్తుందని తేలింది. వ్యక్తులు అంతగా బయటి వారితో కలసి తిరగకపోవటం, శరీరానికి ఎండా సరిగ్గా సోకక పోవటం దీనికి కారణం. అయితే నిజానికి డి విటమిన్ ఆహరం ద్వారా చాల తక్కువగా అందుతుంది. 
 
మన చర్మానికి ఎండ వేడి తగిలినప్పుడు దిన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. కనుక రోజూ చర్మానికి కాసంత సేపు అయినా ఎండ తగిలేట్టు చూసుకోవటం చాల అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి.
 
 అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. 
 
చేపలు, లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. 
 
పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం.

అన్నీ చూడండి

September 02, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

పాకిస్థాన్‌లో డ్రైవర్ లేకుండా రిమోట్‌తో నడిచే కారు... పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది.. (video)

నేపాల్‌ వరద విపత్తు : వెయ్యి దాటిన మృతుల సంఖ్య

సాయన్నను రెస్ట్ రూమ్‌కు లాక్కెళ్లి చొక్కాపట్టుకుని కొట్టారు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Video)

మేట్టూరు డ్యామ్‌‌ను ప్రారంభించిన సీఎం విజయ్.. బామ్మతో విజయ్ క్యూట్ వీడియో

అన్నీ చూడండి

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments