ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (10:14 IST)

బోన్‌లెస్ చికెన్ వింగ్స్ పేరిట ఎలుకల మాంసం..

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) దిగ్భ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. ప్రతి ఏడాది నాలుగున్నర లక్షల కిలోల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ తెలిపింది. ఎక్కడపడితే ఎక్కడ బోన్

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) దిగ్భ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. ప్రతి ఏడాది నాలుగున్నర లక్షల కిలోల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ తెలిపింది. ఎక్కడపడితే ఎక్కడ బోన్‌లెస్ చికెన్ వింగ్స్ పేరిట అమ్మేస్తున్నారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అందుకే చికెన్ ప్రియులు ఎక్కడ పడితే అక్కడ ''బోన్‌లెస్‌ చికెన్‌ వింగ్స్" వంటకాలను తినవద్దని ఎఫ్‌డీఏ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
 
ఎలుక మాంసాన్ని కంటైనర్ల కొద్దీ ఎలుక మాంసాన్ని అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తున్నారు. ఆ మాంసాన్ని అమెరికా కంపెనీలు ప్రాసెస్‌ చేసి "బోన్‌లెస్‌ చికెన్‌ వింగ్స్‌" పేరుతో రెస్టారెంట్లకు విక్రయిస్తున్నాయని ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కో పోర్టులోకి వచ్చిన ఓ కంటైనర్‌ను పరిశీలించిన ఎఫ్‌డీఏ తెలిపింది. ఇంకా చికెన్ రెక్కలు తింటే.. బరువు పెరుగుతారు. 
 
ఇంకా స్టెరాయిడ్స్‌‌ను చిన్నపాటి ఇంజెక్షన్ల రూపంలో మెడ, రెక్కల ద్వారా వాటి శరీరంలోకి ఎక్కిస్తారు. దీంతో ఆ స్టెరాయిడ్స్ రెక్కలు, మెడ భాగాల్లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. స్టెరాయిడ్స్ వల్ల మానవుడిలో హార్మోన్ల వ్యవస్థ దెబ్బతినడంతోపాటు క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా ఆస్కారం ఉంది. ఉందట. అందుకే ఆ భాగాలను తినకుండా ఉండటం వల్ల సమస్య కొంత వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.