వేసవిలో జాండీస్‌తో జాగ్రత్త.. రోజూ నాలుగు లీటర్ల నీరు తాగండి

వేసవిలో వచ్చే పచ్చ కామెర్లు (జాండీస్) వ్యాధి చాలా ప్రమాదకరం. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని ఈ పచ్చకామెర్ల వ్యాధి అతి సూక్ష్మమైన క్రిములవల్ల సోకుతుంది. 10 నుంచి 20 రోజలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (10:40 IST)
వేసవిలో వచ్చే పచ్చ కామెర్లు (జాండీస్) వ్యాధి చాలా ప్రమాదకరం. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని ఈ పచ్చకామెర్ల వ్యాధి అతి సూక్ష్మమైన క్రిములవల్ల సోకుతుంది. 10 నుంచి 20 రోజలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత జ్వరం, ఆకలి లేకపోవటం, కొవ్వు పదార్థాలను తినలేని పరిస్థితి ఏర్పడటం లాంటి లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. కాబట్టి వేసవిలో ఈ లక్షణాలను గమనించినట్లయితే ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
 
నీళ్ల విరేచనాలు (అతిసార) వ్యాధిపట్ల కూడా వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం వల్ల నీళ్ల విరేచనాల బారిన పడుతుంటారు. ఈ సమస్యవల్ల ఎక్కువగా విరేచనాలు అవటంవల్ల రోగులు నీరసించిపోతారు. వెంటనే అప్రమత్తమై తగిన చికిత్సను అందించకపోతే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం లేకపోలేదు.
 
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వడదెబ్బ. వేసవిలో ఈ వడదెబ్బకు గురికానివారు చాలా అరుదు. తీవ్రమైన ఎండవేడిని భరించలేనివారు ఈ వడదెబ్బ బారిన పడుతుంటారు. ఈ సమస్య వచ్చినట్లయితే 104 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం, శరీరమంతా వేడిగా, పొడిగా, ఎర్రగా కందిపోతుంది. అలాగే నాడీ వేగంగా కొట్టుకోవటం, రక్తపోటు పడిపోవటంలాంటివి వడదెబ్బ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యకు గురైనవారిపై చల్లని నీటిని చల్లుతూ, గాలి బాగా వచ్చేటట్లుగా చూడాలి. 
 
వేసవిలో ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పై వ్యాధులు, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలేంటంటే.. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లటానికి ముందుగానే సన్‌స్క్రీన్ లోషన్‌ను చర్మానికి రాసుకోవాలి. కూల్ డ్రింక్‌లను పక్కనపెట్టి సహజసిద్ధంగా లభించే నీరు, కొబ్బరినీరు త్రాగటం మంచిది.
 
ప్రతిరోజూ 4 లీటర్లకు తగ్గకుండా మంచినీటిని తప్పనిసరిగా తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు లేదా హెల్మెట్ ధరించాలి. ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను ఎండలో బయటికి తీసుకెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు, తలపై టోపీ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. 

అన్నీ చూడండి

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

అన్నీ చూడండి

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

Suriya: సూర్య, జై భీమ్ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments