Daily Horoscope
✕

చింతచిగురుతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

Written By సందీప్
Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (10:50 IST)
ఆకుకూరలు మనం తరచుగా తింటుంటాం. వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ చింత చిగురును అరుదుగా తింటుంటాం. మిగతా ఆకుకూరల్లా ఎక్కువగా తినము. చింత చిగురులోని పోషకాలు తెలిస్తే మీరు వాటిని అడపాదడపా తెచ్చుకుని తింటారు. కంటి సమస్యలతో బాధపడేవారు తరచూ చింతచిగురు తించే కళ్ల దరదలు, మంటలు తగ్గుతాయి. కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 
 
చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నందున సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్నవారు కూడా చింతచిగురును తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింతచిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. చింతచిగురు గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
 
శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. 
 
పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చింతచిగురును వాడటం మంచిది. ఎందుకంటే ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.

అన్నీ చూడండి

Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం

మంచినీళ్ల బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

భర్త, అత్తమామల వరకట్నం వేధింపులు.. ఉరేసుకుని ఆత్మహత్య

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - 3 దశల్లో పోలింగ్

స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన-తెదేపా మధ్య లుకలుకలు మొదలయ్యాయా?

అన్నీ చూడండి

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య

తర్వాతి కథనం
Show comments