శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:45 IST)

బ్రాయిలర్ కోడి.. ఆడాకాదు.. మగాకాదు.. దాన్నెందుకు తినడం..?

కోడి మాంసం ఆరోగ్యానికి మంచిది. నాటుకోడి ఆరోగ్యానికి తగిన పోషకాలను అందిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజలంతా బ్రాయిలర్ కోడిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారంలో రెండుసార్లైనా బ్రాయిలర్ కోడితో చేసే వంటకాలను ఇష్టపడి మరీ తింటున్నారు. అయితే బ్రాయిలర్ కోడి మాంసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎందుకంటే బ్రాయిలర్ కోడి...ఆడ,మగా ఇరు వర్గాలకు చెందినది కాదు. దీన్ని పెంచేందుకు రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే దీన్ని పెంచేయడం జరుగుతోంది. అందుచేత బ్రాయిలర్ కోడిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా వుంటుంది. తద్వారా బ్రాయిలర్ కోడి మాంసాన్ని మాసంలో నాలుగైదు సార్లు తీసుకుంటే ఒబిసిటీ, హృద్రోగ సమస్యలు, రక్తపోటు వంటి సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అందుచేత బ్రాయిలర్ కోడితో చేసే వంటకాలకు దూరంగా వుండటం మంచిది. ఇంకా బ్రాయిలర్ కోడి మాంసాన్ని తరచూ తీసుకునే వారిలో క్యాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతున్నాయని ఇటీవల పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
చికెన్‌లో గ్రిల్డ్ చికెన్, తండూరీ చికెన్‌ను తినడం మానేయాలి. అతిగా ఉడికిపోయే బ్రాయిలర్ చికెన్‌ను తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోడిని పెంచేందుకు వినియోగిస్తున్న రసాయనాల ద్వారా మహిళల్లో అతి త్వరగా వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతాయని వైద్యులు చెప్తున్నారు.