సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (16:06 IST)

అల్లం నీటిని సేవిస్తే కలిగే ఫలితం ఏంటి? (video)

Ginger
అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రత్యేకంగా అల్లం నీటిని తాగడంపై పరిమిత పరిశోధనలు ఉన్నాయి. అయితే అల్లం, అల్లం నీరు క్రింది సూచించిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి.

 
అల్లం నీరు కొన్ని రకాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు అల్లంను యాడ్-ఆన్ థెరపీగా ఉపయోగించడం ఉత్తమమని పరిశోధకులు కనుగొన్నారు.

 
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

 
అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం అపాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు.