ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (14:38 IST)

బిర్యానీ లాగిస్తున్నారా? నెయ్యి, వనస్పతి, డాల్డా, మసాలాలతో ఇబ్బందే!

షాపుల్లో బిర్యానీ లాగిస్తున్నారా? అయితే కాస్త వెనక్కి తగ్గండి. పుట్టిన రోజు వేడుకలైనా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు అతిగా చికెన్,

షాపుల్లో బిర్యానీ లాగిస్తున్నారా? అయితే కాస్త వెనక్కి తగ్గండి. పుట్టిన రోజు వేడుకలైనా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిర్యానీతో పాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయని వారు చెప్తున్నారు. 
 
బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకే సారి అవసరం లేదని తెలిపారు. 
 
మద్యం అలవాట్లు లేకున్నా ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతీ ఏడాది 30 నుంచి 35 శాతం పెరుగుతోందట. నగరాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
 
వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని పరిశోధనలో వెల్లడైంది.