Daily Horoscope
✕

కొత్తిమీర కూరల్లో వేస్తుంటారు... ఎందుకని?

Written By సిహెచ్
Updated: గురువారం, 18 జులై 2019 (21:49 IST)
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొత్తిమీరలో పలు రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తిమీర సొంతం. అయితే కొత్తిమీర రుచిలోనే కాదు.... ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా అద్బతంగా సహాయపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. ఇందులో మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి.
 
2. దీనిలో విటమిన్ సి, కె లతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
 
3. మధుమేహంతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది. 
 
4. దీనిలో లభించే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.
 
5. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. 
 
6. కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గిస్తాయి. అంతేకాకుండా మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.

అన్నీ చూడండి

ఏపీకి చేయూత నిచ్చిన విజయ్ సర్కారు.. ఎలాగంటే?

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ... కానీ, షరతులు వర్తిస్తాయ్...

సూపర్ మార్కెట్లో రేవ్ పార్టీ.. ఎలా సాధ్యమైందంటే.. వీడియో వైరల్ (video)

కర్వా చౌత్ వ్రతం చేయలేదని ఆగ్రహం - భార్యపై భర్త ఫిర్యాదు

Mobile Phone: ఛార్జింగ్‌లోని మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎవరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

కేవలం 25 రోజుల్లో చిత్రీకరణ జరిగేలా ఓరి నాయనో చిత్రం ప్రారంభమైంది

cult movie review: మితిమీరిన హింస, రక్తపాతం కాన్సెప్ట్ గా విశ్వక్ సేన్.. కల్ట్ రివ్యూ

సమంత ప్రెగ్నెన్సీ డైరీ.. ఫిట్‌నెట్ అదుర్స్.. వీడియో వైరల్

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

తర్వాతి కథనం
Show comments