గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (11:21 IST)

అసలు అతి విశ్వాసం అంటే ఏమిటి?

మనకందరకి ఏదో ఒక సందర్భంలో అతి విశ్వాసం ప్రదర్శించే వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వారు మన బంధువో, మన మిత్రుడో, మన సహద్యోగో, మన ఉన్నతాధికారో లేదా మన స్నేహితుడైనా కావచ్చు. ఇటువంటి వ్యక్తులు తమ జ్ఞానం గురిం

మనకందరకి ఏదో ఒక సందర్భంలో అతి విశ్వాసం ప్రదర్శించే వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వారు మన బంధువో, మన మిత్రుడో, మన సహద్యోగో, మన ఉన్నతాధికారో లేదా మన స్నేహితుడైనా కావచ్చు. ఇటువంటి వ్యక్తులు తమ జ్ఞానం గురించి, తాము సాధించిన వాటి గురించి, తమ భవిష్యత్ ప్రణాళికల గురించి తమనుతాము పొగడుకుంటూ మాట్లాడుతుంటారు. 
 
అందరికంటే తామే గొప్పన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఈ లక్షణాలు మీ ప్రవర్తనకు సరిపోతాయా ? సరిపోయినట్లయితే మీరు అతి విశ్వాసంతో ఉన్నట్లు చెప్పవచ్చు. అతి విశ్వాసం ఒక పాజిటివ్ విషయం అయినప్పటికి పరోక్షంగా దాని వలన చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అవునా... అంటారా..? అయితే ఇవి చదవాల్సిందే.
 
అసలు అతి విశ్వాసం అంటే ఏమిటి?
 
ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి మధ్య చిన్న గీత అడ్డువున్నది. అతి  విశ్వాసం అనేది ఒక రకమైన అతి నమ్మకం ,తనకు తాను మిగతా అందరి కంటే మిన్నఅనే భావం కలిగి ఉండటం. అటువంటి వ్యక్తులు తనకు గొప్పగా భావిస్తారు. తరచుగా ఇతరులను  తక్కువచేసే పదజాలంతో మాట్లడటం, ఏహ్యభావంతో చూడటం, తక్కువగా చూడటం చేస్తారు 
 
సైకాలజిస్ట్ చాందిని మెహతా అభిప్రాయం ప్రకారం అతివిశ్వాసం మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ, ప్రత్యేకంగా విజయం సాధించిన వ్యాపారవేత్తలలో ఎక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే భారీ లక్ష్యాలతో జీవితాన్ని సాగించే మహిళలు, అందంగా కనిపించే మహిళలు అతి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. 
 
అటువంటి వ్యక్తులు క్రికెట్, స్టాక్ మార్కెట్ వంటి విషయాల్లో తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. వారికి ఆ అంశాలపై సరైన అవగాహన లేకపోయినప్పటికి తమ అభిప్రాయమే సరైనదని నమ్ముతారు. వీరు ఇతరుల అభిప్రాయాలను వ్యతిరేకించటం, అవహేళన చేయడం చేస్తారు.   
 
ఈ సమస్యను అధిగమించడం ఎట్లా..?
 * మీరు మంచి విజయవంతమైన వ్యాపారవేత్త అయినప్పటికి ఏ విషయాన్ని సుళువుగా తీసుకోరాదు. సర్దుబాటు ధోరణిని కలిగి నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఏ వ్యక్తికి దేని గురించి అంతగా తెలియదని గుర్తించాలి.
 
* ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు, సొంత అభిప్రాయాలు ఉంటాయని గుర్తించుకోవాలి. తనకు మాత్రమే అన్ని తెలిసుననీ, తాను మాత్రమే అన్ని కరెక్ట్ చేస్తానని అనుకోరాదు. 
 
*మీ బలహీనతలు అంగీకరించాలి. మీరు కూడా తప్పులు చేస్తారని భావించాలి, అన్ని కరెక్ట్ చేస్తారని అనుకోవద్దు. ఇతరుల సామర్ధ్యాన్ని అభినందించాలి.