శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 మే 2016 (18:23 IST)

గుండెపోటు... సగంమందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వచ్చేస్తుందట... నిరోధించేదెలా..?

గుండెపోటు అంటే ఇక ప్రాణాలు దక్కవనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి గుండెపోటు విషయంలో కొందరిలో ముందస్తుగా కొన్ని సూచనలు కనబడుతాయి. ఐతే సగంమందిలో అసలు ఎలాంటి లక్షణాలు, హెచ్చరికలు, సూచనలు లేకుండానే గుండెపోటు వచ్చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ హెల్త్

గుండెపోటు అంటే ఇక ప్రాణాలు దక్కవనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి గుండెపోటు విషయంలో కొందరిలో ముందస్తుగా కొన్ని సూచనలు కనబడుతాయి. ఐతే సగంమందిలో అసలు ఎలాంటి లక్షణాలు, హెచ్చరికలు, సూచనలు లేకుండానే గుండెపోటు వచ్చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏటా కనీసం 17 మిలియన్ల మందికి పైగా ప్రపంచంలో గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. 
 
2030 నాటికి ఈ సంఖ్య 23 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజంగా గుండెపోటు బారినపడే వారిలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం చల్లబడిపోవడం తదితర లక్షణాలు అగుపిస్తాయి. ఐతే నిశ్శబ్దంగా... అంటే ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే... గుండెకు సరఫరా అయ్యే రక్తం గణనీయంగా తగ్గిపోయి... ఒకదశలో పూర్తిగా ఆగిపోవడంతో గుండెపోటుతో మరణం సంభవించే అవకాశం ఉన్నట్లు అధ్యయనకారులు చెపుతున్నారు. సహజంగా గుండెపోటు లక్షణాలను బట్టి శస్త్రచికిత్స లేదా సంబంధిత మందులు వాడటం ద్వారా చికిత్స చేస్తారు. కానీ ఇలాంటి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చినపుడు ఏమీ చేయలేని స్థితి నెలకొంటుంది. ఇలాంటి సైలెంట్ హార్ట్ ఎటాక్ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 
 
సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మరణాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందేవారి సంఖ్య మామూలు వాటికంటే మూడురెట్లు అధికంగా ఉంటుంది. ఐతే ఈ సైలెట్ ఎటాక్స్ ను నిలువరించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెపుతున్నారు. పొగతాగడం, అధికబరువు కలవారు బరువు తగ్గించుకోవడం, కొవ్వును అదుపులో ఉంచుకోవడం, బీపీని కంట్రోల్ చేసుకోవడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ బారిన పడకుండా ఉండవచ్చని అంటున్నారు.