శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 11 జులై 2016 (17:02 IST)

నెట్ జనుల్లారా.... జర జాగ్రత్త.... ఆరోగ్యం

ఇంటర్‌నెట్‌కూ... జలుబూ, ఫ్లూ జ్వరాలూ, తరచూ జబ్బు పడటానికి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ కొందరిపై నిర్వహించిన పరిశోధనల్లో విచిత్రమైన విషయాలు తెలిశాయి. శ్వాన్సీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ హెల్త్ సెన్సైస్‌లో నిర్వహించ

ఇంటర్‌నెట్‌కూ... జలుబూ, ఫ్లూ జ్వరాలూ, తరచూ జబ్బు పడటానికి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ కొందరిపై నిర్వహించిన పరిశోధనల్లో విచిత్రమైన విషయాలు తెలిశాయి. శ్వాన్సీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ హెల్త్ సెన్సైస్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక అంశాలతో పాటు ఇంటర్‌నెట్ వల్ల ఆరోగ్యం దెబ్బతినే తీరు కూడా తేటతెల్లమైంది. 
 
ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించే వారిలో మామూలు పాళ్ల కంటే ఎక్కువగా కార్టిసోల్ వెలువడుతుండటం వల్ల వాళ్ల రోగనిరోధక శక్తి కూడా దెబ్బ తింటుందని, ఫలితంగా ఇది పూర్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినే విషయంలో  మహిళలు, పురుషులు అనే తేడా ఉండదని అంటున్నారు. 
 
ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే విషయంలో మహిళలు, పురుషుల ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. మహిళలు ప్రధానంగా షాపింగ్, సోషల్ మీడియా కోసం ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారు. అదే పురుషులు మాత్రం పోర్నోగ్రఫీ, గేమింగ్ కోసం ఎక్కువగా నెట్‌ను ఉపయోగిస్తున్నట్లు కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది.