బీపీ నియంత్రణలో లేనివారు రంజాన్ 'ఉపవాసా'ని దూరంగా ఉండటమే ఉత్తమం!
ముస్లిం సోదరుల పవిత్ర పండగల్లో రంజాన్ ఒకటి. ఈ పండగకు నెల రోజుల ముందే ఉపవాసాన్ని ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ దీక్షలు వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, రక్తపోటు ఉన్నవారు ఈ ఉపవాసానికి దూరంగా ఉండటమే ఉత్తమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
రక్తపోటు నియంత్రణలో లేనిపక్షంలో ఉపవాసం ఉండకపోవడమే మంచిదంటున్నారు. అలాగే, తీవ్ర హృద్రోగ సమస్యలతో బాధపడుతూ.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఇదే పద్ధతిని పాటించాలని సూచించారు. నియంత్రణలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత మితంగా తినాలని సూచించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏమీ తినకుండా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు గల వారు బీపీ నియంత్రణలో ఉందో లేదో ముందుగానే సరిచూసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.