శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (17:34 IST)

గర్భాన్ని నిరోధించాలా? మహిళలే మాత్రలు మింగక్కర్లేదు.. మేల్ పిల్స్ వచ్చేశాయ్

గర్భాన్ని నిరోధించడంలో మహిళలకు పురుషులు సహకరించే కొత్తమందు వచ్చేసింది. దీనిపై జరిగిన పరిశోధకులు ఫలించాయని వార్తలొస్తున్నాయి. ఇంతకాలం గర్భాన్ని నిరోధించేందుకు కేవలం మహిళలు మాత్రమే కొన్ని రకాల టాబ్లెట్ల

గర్భాన్ని నిరోధించడంలో మహిళలకు పురుషులు సహకరించే కొత్తమందు వచ్చేసింది. దీనిపై జరిగిన పరిశోధకులు ఫలించాయని వార్తలొస్తున్నాయి. ఇంతకాలం గర్భాన్ని నిరోధించేందుకు కేవలం మహిళలు మాత్రమే కొన్ని రకాల టాబ్లెట్లను ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఇకపై ఆ బాధలు తీరినట్లేనని.. మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని కొంతకాలం పాటు నిస్సత్తువగా ఉంచే ప్రయోగం విజయవంతం అయ్యిందని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్‌కి 'సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్'గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్ని నిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు. దీనిపై ఓల్వర్‌ హంప్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ హాల్ మాట్లాడుతూ.. గర్భనిరోధించడంలో ఈ టాబ్లెట్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు. అంతేకాదు శుక్రకణా ఉత్పత్తి కావాలనుకుంటే కొన్ని నిమిషాలలోనే ఉత్పత్తి జరిగేలా పనిచేసే టాబ్లెట్ తయారుచేశామని తెలిపారు.
 
సెక్స్‌లో పాల్గొనేందుకు కొన్ని నిమిషాల ముందు లేదా కొన్ని గంటల్లోపు మగవారు ఈ టాబ్లెట్  వేసుకోవాలి. కండోమ్స్ ఉపయోగించడం ఇబ్బందికరంగా భావిస్తున్న వారికి టాబ్లెట్స్ ఉపయోగపడతాయని జాన్ హాల్ వెల్లడించారు.