శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2016 (15:31 IST)

నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలు విధిగా చేయించుకోవాల్సిందే : కేంద్రం

మహిళల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ విధిగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాలని స్పష్టం చేసింది.

మహిళల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ విధిగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. 
 
'స్క్రీనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కేన్సర్' కింద కొన్ని సూచనలు కూడా చేసింది. తొలుత దేశంలో ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ కేన్సర్ నివారణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి అగర్తలా నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతారు. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ... అది ఎలాంటి కేన్సర్‌ అయినా సరే ముందుగానే పసిగడితే ప్రాణాలు కాపాడుకునేందుకు వీలవుతుందన్నారు. స్క్రీనింగ్ టెస్టుల వల్ల మహిళల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరుగుతుందన్నారు. సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి ఈ మూడు రకాల కేన్సర్‌లకు స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు.