వాటర్ ట్యాంకుల్లోనే 86 శాతం ప్రాణాంతక దోమలు
పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై మంచినీటి ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల్లో వివిధ రకాలో దోమలు చేరివుంటాయి. వీటిలో 86 శాతం ప్రాణాంతక దోమలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తయారు చేసిన ఓ నివేదికలో పేర్కొంద
పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై మంచినీటి ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల్లో వివిధ రకాలో దోమలు చేరివుంటాయి. వీటిలో 86 శాతం ప్రాణాంతక దోమలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తయారు చేసిన ఓ నివేదికలో పేర్కొంది.
సాధారణంగా దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వస్తుంటాయి. ఈ దోమల్లో 86 శాతం మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్లు పేర్కొంది. టెర్రస్‌పైన ఉండే ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కనస్ట్రక్షన్ సైట్లలోనే ఈ దోమలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది.
ప్రాణాంతక దోమలు అధికంగా ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం ఉంటున్నాయని తెలిపింది. డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కనస్ట్రక్షన్ సైట్స్లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. ఈ యేడాదిలో గత నెల 31వ తేదీ వరకు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య మరింత పెరుగనుందని ఆందోళన వ్యక్తంచేసింది.