1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 18 నవంబరు 2014 (17:26 IST)

ఐ మిస్ యు అని ఆమె మెసేజ్ పెట్టింది... అతడొచ్చాడు... నిద్రపట్టడంలేదు...

మాకు పెళ్లయి ఏడేళ్లయింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. హేపీగా ఉంటున్నాం. ఐతే గతంలో నా భార్యకు ఒక లవర్ ఉండేవాడట. ఏదో కారణాల వల్ల లవ్ ఫెయిలై ఇద్దరం విడిపోయామని పెళ్లికి ముందే చెప్పింది. కాబట్టి ఆమె గత జీవితం గురించి పట్టించుకోవడంలేదు. ఐతే ఈ మధ్య మా పెద్దమ్మ కొడుకు బిజినెస్ నిమిత్తం నగరానికి వచ్చాడు. అతడు బిజినెస్ టూర్లో మా ఇంటికి కూడా వచ్చాడు. వచ్చిన రెండు రోజుల్లోనే చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. నా భార్యతో తెగ కబుర్లు చెప్పేవాడు. 
 
నేను నా పనిపై వెళ్లిపోయేవాడిని. వాడు ఎప్పుడు ఇంటికి వచ్చేవాడో వెళ్లేవాడో పట్టించుకునేవాడిని కాదు. ఐతే ఒక రోజు నా భార్య సెల్ ఫోను చూస్తే... అందులో ఐ మిస్ యు, నువ్వు లేనప్పుడు ఎంత మిస్ అవుతున్నానో అని రాసి ఉంది. అది చూసిన దగ్గర్నుంచి నాకు నిద్రపట్టడంలేదు. పనిపై ధ్యాస మళ్లడంలేదు. ఆమె అతడికి అలాంటి మెసేజ్ పెట్టి ఉంటే దానర్థం వారి మధ్య సంబంధం సాగుతుందేమోనని అనుమానంగా ఉంది. నా భార్యతో దీనిపై ఎలా అప్రోచ్ కావాలో అర్థం కావడంలేదు...
 
భార్యాభర్తల సంబంధం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం సన్నగిల్లితే అనేక అనుమానాలకు తావిచ్చినట్లవుతుంది. మిస్ యు అన్నంత మాత్రాన సెక్స్ సంబంధం వరకూ వెళ్లిపోనక్కర్లేదు. ఆమె మీ వివాహానికి ముందే ఆమెకున్న ప్రేమ సంగతి నిజాయితీగా చెప్పేసింది. కాబట్టి ఆమెపై అపనమ్మకం పెంచుకోకుండా మీ బాధను ఆమె వద్ద తగు రీతిలో వ్యక్తపరచండి. పరిష్కారమవుతుంది.