బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:19 IST)

చిలకడ దుంపలను ఉడికించి ఇలా చేస్తే..?

ఈ సీజల్‌లో చిలకడ దుంపలు ఎక్కువగా దొరుకుతాయి. ఇంగ్లీష్‌లో స్వీట్ పొటాటోస్ అని పిలుస్తారు. ఈ చిలకడ దుంపలకు ఎన్ని పేర్లు ఉన్నా వీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.
 
1. చిలకడ దుంపలలో విటమిన్ ఎ కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ ఆమ్లాలు కంటి సమస్యలను దూరం చేస్తాయి. దీనిని తీసుకుంటే.. బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.
 
2. వీటిని బాగా శుభ్రం చేసుకుని ఉడికించి తింటే.. చాలా రుచిగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తరచు వీటిని తింటే ఎలాంటి కిడ్నీ వ్యాధులైన మటుమాయమై పోతాయి. 
 
3. హైబీపీ చెక్ పెట్టాలంటే.. వీటిని ఉడికించి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అందులో కొద్దిగా చక్కెర, తేనె కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను నూనెలో వేయించి తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది.
 
4. ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు వీటిని తినాలి. వీటిలోని పొటాషియం శరీర వాపులను తగ్గిస్తుంది. దాంతో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. తద్వారా శరీరం రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. 
 
5. వీటిలో విటమిన్ బి 6 జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగురుస్తుంది. ఏ సీజల్‌లో దొరికే పండ్లు ఆ సీజల్‌లోనే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్యాల పాలవకుండా ఉంటారు.