గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (11:51 IST)

వేసవి వచ్చేస్తోంది.. నిమ్మరసంతో చర్మ సౌందర్యం.. ఎలాగంటే?

వేసవి వచ్చేస్తోంది. నిమ్మరసం ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తి మెరుగవుతుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇవే కాకుండా బత్తాయి, క్యారెట

వేసవి వచ్చేస్తోంది. నిమ్మరసం ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తి మెరుగవుతుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతుంది. 
 
ఇక వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తాగాలి. ఇందులోని 'సి' విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కాంతులీనుతుంది. ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.